హైదరాబాద్ చాలెంజర్స్ చెస్ సెల క్షన్ టోర్నీలో షణ్ముఖ తేజ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. చిక్కడపల్లిలోని హైదరాబాద్ జిల్లా చెస్ సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఈ టోర్నీలో బిపిన్ రాజ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ చాలెంజర్స్ చెస్ సెల క్షన్ టోర్నీలో షణ్ముఖ తేజ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. చిక్కడపల్లిలోని హైదరాబాద్ జిల్లా చెస్ సంఘం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఈ టోర్నీలో బిపిన్ రాజ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
మిధుష్ మూడో స్థానంలో, పూజాంజలి నాలుగో స్థానంలో నిలిచారు. వీరు మేలో జరగనున్న ఏపీ స్టేట్ చాంలెంజర్స్ పోటీల్లో హైదరాబాద్ జిల్లా తర ఫున పాల్గొంటారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం (ఏపీసీఏ) జనరల్ సెక్రటరీ కన్నా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీఏ నిర్వాహక కార్యదర్శి శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.