
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారులు సాయిశ్రీ చరిత వరేణ్య, శ్రీకర్ ఆకట్టుకున్నారు. రాష్ట్ర చెస్ సంఘం కార్యాలయంలో జరిగిన ఈ టోర్నీలో అండర్–11 బాలబాలికల విభాగంలో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. బాలికల విభా గంలో హైదరాబాద్‌కే చెందిన భవిష్య, రితిక... బాలుర విభాగంలో ధనుశ్ (నల్లగొండ), రుద్ర రక్షిత్ (నిజామాబాద్) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు.
ఇతర వయో విభాగాల విజేతల వివరాలు
అండర్–7 బాలురు: 1. శ్రవణ్ (హైదరాబాద్), 2. సంతోష్ (రంగారెడ్డి), 3. మాన్విత్ (హైదరాబాద్). బాలికలు: 1. అర్పిత (రంగారెడ్డి), 2. సస్య (హైదరాబాద్), 3. అక్షయ (హైదరాబాద్). అండర్–9 బాలురు: 1. విశ్వక్సేన్, 2. ప్రణీత్, 3. ప్రద్యుమ్న.
, , చెస్ టోర్నమెంట్, హైదరబాద్, తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్