టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ వరుసగా ఐదో ‘డ్రా’ నమోదు
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ వరుసగా ఐదో ‘డ్రా’ నమోదు చేశాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో బుధవారం జరిగిన పదో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 37 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.
14 మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పదో రౌండ్ తర్వాత హరికృష్ణ ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో మరో మూడు రౌండ్‌లు మిగిలి ఉన్నాయి.