బట్లర్ హాఫ్ సెంచరీ:విజయం దిశగా ఇంగ్లండ్ | buttler gets half century | Sakshi
Sakshi News home page

బట్లర్ హాఫ్ సెంచరీ:విజయం దిశగా ఇంగ్లండ్

Jan 30 2015 4:00 PM | Updated on Sep 2 2017 8:32 PM

బట్లర్ హాఫ్ సెంచరీ:విజయం దిశగా ఇంగ్లండ్

బట్లర్ హాఫ్ సెంచరీ:విజయం దిశగా ఇంగ్లండ్

ముక్కోణపు సిరీస్ లో ఇంగ్లండ్ విజయం దిశగా పయనిస్తోంది.

పెర్త్: ముక్కోణపు సిరీస్ లో ఇంగ్లండ్ విజయం దిశగా పయనిస్తోంది. శుక్రవారం టీమిండియాతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆదిలో ఇబ్బంది పడ్డ తరువాత గాడిలో పడింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బట్లర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, అంతకుముందు జేమ్స్ టేలర్ హాఫ్ సెంచరీ చేశాడు.

 

201 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించి ఇంగ్లండ్ తొలుత కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే టేలర్- బట్లర్ ల జోడీ మంచి ఇన్నింగ్స్ తో ఇంగ్లండ్ తేరుకుంది.41.5 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 178 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement