బోపన్న జంట ఓటమి  | Bopanna Pair Defeated In Rotterdam Tournament | Sakshi
Sakshi News home page

బోపన్న జంట ఓటమి 

Feb 17 2020 10:14 AM | Updated on Feb 17 2020 10:14 AM

Bopanna Pair Defeated In Rotterdam Tournament - Sakshi

న్యూఢిల్లీ: రోటర్‌డామ్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) జంట పోరాటం ముగిసింది. నెదర్లాండ్స్‌లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో బోపన్న–షపోవలోవ్‌ ద్వయం 7–5, 2–6, 8–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో హెన్రీ కొంటినెన్‌ (ఫిన్‌లాండ్‌)–జాన్‌ లెనార్డ్‌ స్ట్రఫ్‌ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది.

73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ఏడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసింది. సెమీస్‌లో ఓడిన బోపన్న జోడీకి 180 ర్యాంకింగ్‌ పాయింట్లతోపాటు 32,080 యూరోలు (రూ. 24 లక్షల 85 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement