ఘనంగా భువనేశ్వర్‌ నిశ్చితార్థం | Bhuvneshwar Kumar gets engaged to Nupur Nagar | Sakshi
Sakshi News home page

ఘనంగా భువనేశ్వర్‌ నిశ్చితార్థం

Oct 5 2017 7:15 PM | Updated on Oct 5 2017 9:05 PM

Bhuvneshwar Kumar gets engaged to Nupur Nagar

సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ నిశ్చితార్థం ప్రేయసి నుపూర్‌ నగార్‌తో బుధవారం గ్రేటర్‌ నోయిడాలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భువీ-నుపూర్‌ దగ్గరి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో వీరి వివాహాం జరిపించాలని కుటుంబ సభ్యులు నిశ్చయించారు. ఇక ఈ నిశ్చితార్థంకు ముందు భువీ తన ప్రియురాలు నుపూర్‌ నగార్‌ అని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు తెలిపిన విషయం తెలిసిందే. 

భువి స్వస్థలం గంగానగర్‌లోనే నుపుర్‌ కుటుంబం నివాసం ఉండేది. భువి తండ్రి కిరణ్‌పాల్‌ సింగ్‌, నుపుర్‌ తండ్రి యశ్‌పాల్‌ సింగ్‌ పోలీస్‌ ఇద్దరూ యూపీ పోలీసు డిపార్టుమెంట్లో సబ్‌ఇన్‌స్పెక్టర్లుగా చేసి రిటైర్‌ కావడం విశేషం. నుపూర్‌ నగార్‌ ఇంజనీరింగ్‌ చదివి నోయిడాలోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ‘మా రెండు కుటుంబాలు ఒకరికొకరికి బాగా తెలుసు. ఇక అమ్మాయి బాగా చదువుకున్నది. భువనేశ్వర్‌ వరుస సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు. ఒక పదిరోజుల సమాయాన్ని చూసుకొని పెళ్లి డేట్‌ను ఫిక్స్‌ చేస్తాం’ అని భువనేశ్వర్‌ తండ్రి మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement