ఆస్ట్రేలియా ఓపెన్లో మహేష్ భూపతి ఓటమి | Bhupathi out of Australian Open mixed doubles | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఓపెన్లో మహేష్ భూపతి ఓటమి

Jan 24 2015 4:08 PM | Updated on Sep 2 2017 8:12 PM

ఆస్ట్రేలియా ఓపెన్లో భారత ఏస్ ఆటగాడు మహేష్ భూపతి పోరాటం ముగిసింది.

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్లో భారత ఏస్ ఆటగాడు మహేష్ భూపతి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలిరౌండ్లో భూపతి జోడీ ఓటమి చవిచూసింది. జర్మిలా గజ్డోసోవాతో జతకట్టిన భూపతి 6-4, 6-7 (7), 8-10తో హవా చింగ్ (చైనీస్ తైపీ), జేమీ ముర్రే (బ్రిటన్) ద్వయం చేతిలో ఓడిపోయాడు.

విలియమ్స్ సిస్టర్స్ ముందంజ

అమెరికా నల్లకలువలు సెరెనా, వీనస్ విలియమ్స్ సిస్టర్స్ మహిళల సింగిల్స్లో ముందంజ వేశారు. మూడో రౌండ్లో సెరెనా 4-6, 6-2, 6-0తో ఎలీనా స్విటోలీనా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. మరో మ్యాచ్లో వీనస్ విలియమ్స్ కూడా తొలి సెట్ కోల్పోయిన అనంతరం ప్రత్యర్థి కెమిల్లా జియోర్గి (ఇటలీ)ని చిత్తుచేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement