
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బెంగళూరు ఎఫ్‌సీ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. ముంబైలో ఆదివారం జరిగిన ఫైనల్లో బెంగళూరు 1–0తో గోవా ఎఫ్‌సీ జట్టును ఓడించింది. నిర్ణీత 90 నిమిషాలు ముగిసే సమయానికి రెండు జట్లు 0–0తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోని తొలి భాగంలోనూ గోల్ నమోదు కాలేదు. మరో నాలుగు నిమిషాల్లో అదనపు సమయం కూడా ముగుస్తుందనగా రాహుల్ భాకే గోల్ చేసి బెంగళూరుకు టైటిల్‌ను ఖాయం చేశాడు.