బెంగాల్ వారియర్స్‌కు ఐదో విజయం | Bengal Warriors to fifth victory | Sakshi
Sakshi News home page

బెంగాల్ వారియర్స్‌కు ఐదో విజయం

Feb 11 2016 12:20 AM | Updated on Sep 3 2017 5:22 PM

ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ జట్టు ఐదో విజయాన్ని నమోదు చేసింది.

 కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ జట్టు ఐదో విజయాన్ని నమోదు చేసింది. జైపూర్ పింక్‌పాంథర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 34-20 పాయింట్ల తేడాతో గెలిచింది. విరామ సమయానికి వారియర్స్ 10-9తో ఒక పాయింట్ ఆధిక్యంలో ఉంది. రెండో అర్ధభాగంలో వారియర్స్ ఆటగాళ్లు విజృంభించి ఆడి నిలకడగా పాయింట్లు సాధించారు.

నితిన్ తోమర్ తొమ్మిది పాయింట్లు స్కోరు చేసి వారియర్స్ విజయంలో ముఖ్యపాత్ర పోషించగా... జాంగ్ కున్ లీ ఐదు పాయింట్లు, మహేశ్ గౌడ్, గిరీశ్ నాలుగేసి పాయింట్లు సాధించారు. మరోమ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా 29-28తో బెంగళూరు బుల్స్‌ను ఓడించి తమ ఖాతాలో మూడో విజయాన్ని జమచేసుకుంది. ప్రస్తుతం బెంగాల్ వారియర్స్ 26 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. గురువారం జరిగే మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్ తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement