అంపైర్ నిర్ణయ పునస్సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)పై తమ పాత అభిప్రాయానికే బీసీసీఐ కట్టుబడి ఉందని, అయితే దీనిపై చర్చకు
జగ్మోహన్ దాల్మియా
కోల్‌కతా: అంపైర్ నిర్ణయ పునస్సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)పై తమ పాత అభిప్రాయానికే బీసీసీఐ కట్టుబడి ఉందని, అయితే దీనిపై చర్చకు అవకాశం ఉందని బోర్డు అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా వెల్లడించారు. ‘డీఆర్‌ఎస్‌పై బోర్డు గతంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదు. అయితే దీనర్థం ఇకపై చర్చించమని కాదు. ప్రస్తుత పద్ధతిలో లోపాలు ఉన్నాయనేది అందరికీ తెలుసు. ఇందులో సాంకేతికాంశాలు ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఏర్పడిన బోర్డు సలహా సంఘం అభిప్రాయం కూడా తీసుకుంటాం’ అని దాల్మియా స్పష్టం చేశారు.