బంగ్లా స్పిన్నర్ బౌలింగ్ పై వేటు | Bangladeshi U-19 spinner Saha banned from bowling | Sakshi
Sakshi News home page

బంగ్లా స్పిన్నర్ బౌలింగ్ పై వేటు

Jan 31 2016 7:44 PM | Updated on Sep 3 2017 4:42 PM

బంగ్లాదేశ్ అండర్ -19 బౌలర్ సంజిత్ సాహా బౌలింగ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిషేధం విధించింది.

ఢాకా: బంగ్లాదేశ్ అండర్ -19  జట్టులో కీలక స్పిన్నరైన సంజిత్ సాహా బౌలింగ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిషేధం విధించింది. సంజిత్ సాహా బౌలింగ్ వివాదాస్పదంగా ఉన్న కారణంగా అతని బౌలింగ్ ను నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ ఆదివారం స్పష్టం చేసింది. దీంతో  ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో సంజిత్ బౌలింగ్ కు దూరంగా ఉండనున్నాడు. బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సంజిత్ సాహా బౌలింగ్ అనుమానంగా ఉండటంతో ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలించిన అనంతరం అతని బౌలింగ్ ను నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. అతను నిబంధనలను ఉల్లంఘించి బౌలింగ్ చేసినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement