
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్ అనుమానాస్పద బౌలింగ్ శైలితో మరోసారి బౌలింగ్‌కు దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయడానికి అతడిని ఐసీసీ అనర్హుడిగా ప్రకటించింది. ఇటీవల అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు. హఫీజ్ ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌పై నిషేధం విధించడం ఇది మూడోసారి .
2014 డిసెంబర్‌లో తొలిసారి ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న హఫీజ్ తర్వాత 2015 జూన్‌లో వివాదాస్పద బౌలింగ్ యాక్షన్‌తో నిషేధం కారణంగా 12 నెలల పాటు బౌలింగ్ చేయలేదు.