బాల్ బ్యాడ్మింటన్ చాంప్ అరోరా | Ball badminton champion arora college team | Sakshi
Sakshi News home page

బాల్ బ్యాడ్మింటన్ చాంప్ అరోరా

Jan 25 2014 11:59 PM | Updated on Sep 2 2017 3:00 AM

ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి పురుషుల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌ను అరోరా కాలేజి జట్టు చేజిక్కించుకుంది.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి పురుషుల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌ను అరోరా కాలేజి జట్టు చేజిక్కించుకుంది. ఓయూ గ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్లో అరోరా కాలేజి జట్టు 40-14తో సునాయాసంగా ఓయూ టెక్నాలజీ కాలేజి జట్టుపై ఘనవిజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో సైఫాబాద్ ఓయూ పీజీ సైన్స్ కాలేజి జట్టు 29-11తో ఓయూ కామర్స్ కాలేజి జట్టుపై విజయం సాధించింది.
 
  అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో అరోరా కాలేజి 40-3తో ఓయూ పీజీ సైన్స్ కాలేజిపై, ఓయూ టెక్నాలజీ కాలేజి 40-11తో ఓయూ కామర్స్ కాలేజిపై గెలిచాయి. ఈ పోటీల విజేతలకు అరోరా కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ బి.విశ్వనాథం ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ ప్రొఫెసర్ వి.సత్యనారాయణ, ఇంటర్ కాలేజి టోర్నీ సెక్రటరీప్రొఫెసర్ బి.సునీల్ కుమార్, సీనియర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ జయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement