
న్యూఢిల్లీ: ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు బజరంగ్ పూనియా (65 కేజీలు), వినోద్ కుమార్ (70 కేజీలు) రజత పతకాలు గెలిచారు. పోలాండ్‌లో ఆదివారం జరిగిన ఫ్రీస్టయిల్ ఫైనల్స్‌లో బజరంగ్ 7–16తో నచిన్ సెర్గీవిచ్ కులర్ (రష్యా) చేతిలో... వినోద్ 1–3తో రిచర్డ్ ఆంథోనీ లూయిస్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. సెమీఫైనల్స్‌లో బజరంగ్ 9–4తో అలీ అక్బర్ (ఇరాన్)పై, వినోద్ 2–1తో తొకోజిమా (జపాన్)పై గెలిచారు.