తెలుగుతేజం భమిడిపాటి సాయిప్రణీత్ రష్యా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో ఓడినా... స్ఫూర్తిదాయక పోరాటంతో ఆకట్టుకున్నాడు.
రష్యా గ్రాండ్ ప్రి
న్యూఢిల్లీ: తెలుగుతేజం భమిడిపాటి సాయిప్రణీత్ రష్యా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో ఓడినా... స్ఫూర్తిదాయక పోరాటంతో ఆకట్టుకున్నాడు. వ్లాదివొస్తోక్‌లో శుక్రవారం జరిగిన రష్యా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత యువ ఆటగాడు, ఆరో సీడ్ సాయిప్రణీత్ 21-23, 17-21తో రెండో సీడ్ వ్లాదిమిర్ మల్కొవ్ (రష్యా) చేతిలో పోరాడి ఓడాడు.
ఒక దశలో హైదరాబాద్ ఆటగాడు... మల్కొవ్‌కు ముచ్చెమటలు పట్టించాడు. రెండు గేముల్లోనూ నువ్వానేనా అన్నట్లు తలపడ్డాడు. అంతకుముందు తొలి రెండు రౌండ్లలో బై లభించడంతో ముందంజ వేసిన ప్రణీత్ ప్రిక్వార్టర్స్‌లో 21-13, 21-4తో స్టానిస్లావ్ పుఖోవ్ (రష్యా)పై అలవోక విజయం సాధించాడు.