నాకంటే బెస్ట్ బ్యాట్స్‌మన్ లక్ష్మణ్! | Azharuddin admiration | Sakshi
Sakshi News home page

నాకంటే బెస్ట్ బ్యాట్స్‌మన్ లక్ష్మణ్!

Aug 17 2015 2:03 AM | Updated on Sep 3 2017 7:33 AM

నాకంటే బెస్ట్ బ్యాట్స్‌మన్ లక్ష్మణ్!

నాకంటే బెస్ట్ బ్యాట్స్‌మన్ లక్ష్మణ్!

మణికట్టు మాయాజాలంతో మంత్రముగ్ధులను చేస్తూ పరుగుల వరదను పారించే బ్యాట్స్‌మెన్ అంటే హైదరాబాదీల

అజహరుద్దీన్ ప్రశంస
 
 సాక్షి, హైదరాబాద్ : మణికట్టు మాయాజాలంతో మంత్రముగ్ధులను చేస్తూ పరుగుల వరదను పారించే బ్యాట్స్‌మెన్ అంటే హైదరాబాదీల తర్వాతే ఎవరైనా అనేది క్రికెట్ ప్రపంచం చెప్పే మాట. అజహరుద్దీన్, ఆ తర్వాత అదే శైలిలో వీవీఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్‌లో తమదైన ముద్ర వేశారు. తమ ఇద్దరి ఆటకు సంబంధించి మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘లక్ష్మణ్ నాలాగే ఆడుతున్నాడని చాలా మంది నాతో చెప్పేవారు.  సరిగ్గా చెప్పాలంటే మా ఇద్దరి స్టయిల్ ఒకటే.

నేనే కొన్నిసార్లు అతడిని అనుకరించానేమో! ఎందుకంటే హైదరాబాద్ అం దించిన అత్యుత్తమ బ్యాట్స్‌మన్ వీవీఎస్. అందులో సందేహం లేదు’ అని అజహర్ ప్రశంసించారు. ఆదివారం హైదరాబాద్ వెటరన్ క్రికెటర్స్ సంఘం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నారు. వెంకటపతి రాజు, అర్షద్ అయూబ్ తదితరులతో పాటు పలువురు రంజీ ఆటగాళ్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement