ఏవీ కాలేజిపై లయోలా అకాడమీ జయభేరి | AV college on to Loyola Academy | Sakshi
Sakshi News home page

ఏవీ కాలేజిపై లయోలా అకాడమీ జయభేరి

Oct 2 2013 12:02 AM | Updated on Sep 1 2017 11:14 PM

ఓయూ ఇంటర్ కాలేజి పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నీలో లయోలా అకాడమీ, భవాన్స్ కాలేజి జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఎల్బీ స్టేడియంలోని హ్యాండ్‌బాల్ మైదానంలో మంగళవారం జరిగిన సెమీస్‌లో లయోలా అకాడమీ జట్టు 15-12తో ఆంధ్రా విద్యాలయం (ఏవీ)పై విజయం సాధించింది.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నీలో లయోలా అకాడమీ, భవాన్స్ కాలేజి జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఎల్బీ స్టేడియంలోని హ్యాండ్‌బాల్ మైదానంలో మంగళవారం జరిగిన సెమీస్‌లో లయోలా అకాడమీ జట్టు 15-12తో ఆంధ్రా విద్యాలయం (ఏవీ)పై విజయం సాధించింది.
 
  తొలి అర్ధభాగం ముగిసే సరికి లయోలా అకాడమీ జట్టు 9-7తో ఆధిక్యాన్ని సాధించింది. తర్వాత అదే ఊపును కొనసాగించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. రెండో సెమీఫైనల్లో భవాన్స్ కాలేజి 21-7తో అవంతి కాలేజి జట్టుపై గెలిచింది. ఈ టోర్నీలో బెస్ట్ ప్లేయర్స్‌గా అవార్డులను భాస్కర్ (ఓయూ సైన్స్ కాలేజి), మహావీర్ సింగ్(హెచ్‌ఎంవీ), ప్రమోద్(భద్రుకా కాలేజి),  హరీష్(గవర్నమెంట్ సిటీ కాలేజి), అశోక్(అవంతి కాలేజి), రాజ్ కుమార్(ఏవీ కాలేజి) టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కన్నారెడ్డి నుంచి అందుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement