ధోని సేన విజయలక్ష్యం 161 | australia set targert of 161 runs for india | Sakshi
Sakshi News home page

ధోని సేన విజయలక్ష్యం 161

Mar 27 2016 9:05 PM | Updated on Sep 3 2017 8:41 PM

ధోని సేన విజయలక్ష్యం 161

ధోని సేన విజయలక్ష్యం 161

వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా భారత్ తో జరుగుతున్న పోరులో ఆస్ట్రేలియా 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

మొహాలి:వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా భారత్ తో జరుగుతున్న పోరులో ఆస్ట్రేలియా 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. అరోన్ ఫించ్(43; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు), ఉస్మాన్ ఖవాజా(26; 16 బంతుల్లో 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు.  ఈ క్రమంలోనే నాల్గో ఓవర్ ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ 200 పైగా స్కోరును నమోదు చేయడం ఖాయంగా కనిపించింది. 

 

అయితే ఆ తరువాత భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్ వేగం తగ్గింది. డేవిడ్ వార్నర్(6),  కెప్టెన్ స్టీవ్ స్మిత్(2) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు పంపడంతో ధోని సేన శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఇక ఆపై మ్యాక్స్ వెల్ (31;28 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) ,  షేన్ వాట్సన్(18 నాటౌట్) మోస్తరుగా రాణించడంతో ఆసీస్ కాస్త ఫర్వాలేదనిపించింది. చివర్లో నేవిల్(10 నాటౌట్; 2 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి    160 పరుగులు నమోదు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా, బూమ్రా, నెహ్రా, అశ్విన్, యువరాజ్ సింగ్ లకు తలో వికెట్ దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement