ఇదొక చెత్త ప్రదర్శన: పాంటింగ్‌

Australia played their worst cricket, Ponting - Sakshi

బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ జట్టు ఒకే ఒక్క చెత్త ప్రదర్శనతోనే మెగా టోర్నీ నుంచి నిష్క్రమణకు కారణమైందని ఆ దేశ మాజీ కెప్టెన్‌, అసిస్టెంట్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ పేర్కొన్నాడు. అత్యంత కీలక సమయంలో తమ ఆటగాళ్లు చేతులెత్తేశారని విమర్శించాడు. ఇప్పటివరకూ జరిగిన వరల్డ్‌కప్‌లు పరంగా చూస్తే తమ జట్టు అత్యంత చెత్త ప్రదర్శనగా ఇది నిలుస్తుందన్నాడు. జట్టు పరంగా తాము సమతూకంగా ఉన్నప్పటికీ కీలక సమయంలో ఆటగాళ్లంతా సమిష్టిగా విఫలం కావడమే సెమీస్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

‘ వరల్డ్‌కప్‌ బరిలోకి మేము ఒక బలమైన జట్టుగా దిగాం. ప్రతీ మ్యాచ్‌కు అందుకు తగిన ప్రణాళికలు రచించుకుంటూ సిద్ధమయ్యాం. కానీ సెమీస్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయాం. ఇది మా జట్టు అత్యంత చెత్త ప్రదర్శన. ఇంగ్లండ్ 50 ఓవర్ల క్రికెట్‌లో చాలా ఎత్తులో ఉంది. వారికి వరల్డ్‌కప్‌ను సాధించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. మరి ఫైనల్లో ఏమీ చేస్తారో చూడాలి. ఒకవేళ వరల్డ్‌కప్‌ను ఇంగ్లండ్‌ సాధిస్తే అది యాషెస్‌ సిరీస్‌పై కూడా కచ్చితంగా ప్రభావం ఉంటుంది. అదే ఊపును వారు యాషెస్‌ సిరీస్‌లో కొనసాగిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు’ అని పాంటింగ్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top