ప్రపంచ నంబర్‌వన్‌ అపూర్వీ  | Apurvi Chandela is world number one in 10m air rifle, Anjum Moudgil claims second position  | Sakshi
Sakshi News home page

ప్రపంచ నంబర్‌వన్‌ అపూర్వీ 

May 2 2019 12:50 AM | Updated on May 2 2019 12:50 AM

Apurvi Chandela is world number one in 10m air rifle, Anjum Moudgil claims second position  - Sakshi

న్యూఢిల్లీ: కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తోన్న భారత మహిళా షూటర్‌ అపూర్వీ చండేలా మరో మైలురాయిని అందుకుంది. అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అపూర్వీ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో తొలిసారి వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకుంది. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అపూర్వీ 1926 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. భారత్‌కే చెందిన మరో రైఫిల్‌ షూటర్‌ అంజుమ్‌ మౌద్గిల్‌ 1695 రేటింగ్‌ పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉంది. గత ఫిబ్రవరిలో జరిగిన ప్రపంచకప్‌ టోర్నీలో అపూర్వీ 252.9 పాయింట్ల స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 2014 కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన ఈ రాజస్తాన్‌ షూటర్‌... 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్యం కైవసం చేసుకుంది.

ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్న అపూర్వీ ఇటీవల బీజింగ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో భారత యువ షూటర్‌ దివ్యాన్‌‡్ష సింగ్‌ పన్వర్‌ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ర్యాంకింగ్స్‌లో అభిషేక్‌ వర్మ 16వ స్థానం నుంచి మూడో ర్యాంక్‌కు చేరుకోగా... సౌరభ్‌ నాలుగో ర్యాంక్‌ నుంచి ఆరో స్థానానికి పడిపోయాడు. పురుషుల ట్రాప్‌ విభాగం ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌ షూటర్‌ కైనన్‌ షెనాయ్‌ 24వ ర్యాంక్‌ నుంచి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement