బాస్కెట్‌బాల్ విజేత అపోలో | Apollo won in basket ball tournment | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌బాల్ విజేత అపోలో

Dec 20 2013 12:06 AM | Updated on Sep 2 2017 1:46 AM

మెడికల్ కళాశాలల క్రీడోత్సవాల్లో భాగంగా జరిగిన బాస్కెట్‌బాల్ ఫైనల్స్‌లో ఆతిథ్య అపోలో విజయం సాధించింది.

జింఖానా, న్యూస్‌లైన్: మెడికల్ కళాశాలల క్రీడోత్సవాల్లో భాగంగా జరిగిన బాస్కెట్‌బాల్ ఫైనల్స్‌లో ఆతిథ్య అపోలో విజయం సాధించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్ (ఏఐఎంఎస్‌ఆర్)లో జరిగిన బాలికల విభాగం ఫైనల్స్‌లో అపోలో జట్టు 27-8తో కామినేని జట్టుపై విజయం సాధించింది.
 
 బాలుర ఫుట్‌బాల్ ఫైనల్స్‌లో డెక్కన్ 3-1తో అపోలోపై నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది.  వాలీబాల్ ఫైనల్స్‌లో కామినేని జట్టు 2-0తో అపోలోపై గెలుపు కైవసం చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్‌లో భాస్కర జట్టు 3 పరుగుల తేడాతో గాంధీ మెడికల్ కళాశాల జట్టుపై నెగ్గింది. తొలుత బరిలోకి దిగిన భాస్కర 148 పరుగులు చేయగా... అనంతరం గాంధీ కళాశాల 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement