ఢిల్లీ సుల్తాన్స్‌కు మరో పరాజయం | Another loss to the Delhi Sultans | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సుల్తాన్స్‌కు మరో పరాజయం

Jan 9 2017 12:27 AM | Updated on Sep 5 2017 12:45 AM

ఢిల్లీ సుల్తాన్స్‌కు మరో పరాజయం

ఢిల్లీ సుల్తాన్స్‌కు మరో పరాజయం

ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2లో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ సారథ్యంలోని ఢిల్లీ సుల్తాన్స్‌ జట్టు వరుసగా రెండో

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2లో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ సారథ్యంలోని ఢిల్లీ సుల్తాన్స్‌ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఆదివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఎన్‌సీఆర్‌ పంజాబ్‌ రాయల్స్‌ జట్టు 5–2 తేడాతో ఢిల్లీ సుల్తాన్స్‌పై గెలిచి రెండో విజయాన్ని అందుకుంది. రాయల్స్‌ జట్టు తరఫున వ్లాదిమర్‌ కిన్‌చెగశ్‌విల్‌ (57 కేజీలు) 8–1తో పంకజ్‌పై, జితేంద్ర (74 కేజీలు) 5–4తో ప్రవీణ్‌ రాణాపై, ఒడునాయో (53 కేజీలు) 15–0తో సంగీత ఫోగట్‌పై, అస్గరోవ్‌ (65 కేజీలు) 6–0తో సుర్జీత్‌పై, మర్జలిక్‌ (75 కేజీలు) 2–1తో అలీనాపై విజయం సాధించారు.

ఢిల్లీ జట్టులో సత్యవర్త్‌ కడియన్‌ (97 కేజీలు) 14–4తో క్రిషన్‌ కుమార్‌పై, సాక్షి (58 కేజీలు) 10–0తో మంజు కుమారిపై గెలుపొందారు. సోమవారం జరిగే మ్యాచ్‌లో ముంబై మహారథి జట్టు జైపూర్‌ నింజాస్‌తో ఆడుతుంది. మరోవైపు యూపీ దంగల్‌ తరఫున ఆడుతున్న ‘ఫోగట్‌ సిస్టర్స్‌’ గీత, బబితా గాయాల కారణంగా ఈ లీగ్‌ మధ్యలో నుంచి వైదొలిగారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement