రెండో రౌండ్‌లో దుర్యోధన్‌ సింగ్‌

Another Indian Boxer Entered The Second Round of The World Boxing Championship - Sakshi

ఎకతెరీన్‌బర్గ్‌ (రష్యా): ప్రతిష్టాత్మక ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్ లో భారత్‌కు చెందిన మరో బాక్సర్‌ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల 69 కేజీల బౌట్‌లో జాతీయ చాంపియన్‌ దుర్యోధన్‌ సింగ్‌ నేగి 4–1తో కొర్యున్‌ అస్టోయన్‌ (అర్మేనియా)ను మట్టి కరిపించాడు. ప్రత్యర్థి బలహీనమైన డిఫెన్సును తనకు అనుకూలంగా మార్చుకున్న దుర్యోధన్‌ పంచ్‌లతో విరుచుకుపడటంతో విజయం ఖాయమైంది. ఇప్పటికే భారత్‌కు చెందిన ఐదుగురు బాక్సర్లు (మనీశ్‌ కౌశిక్, బ్రిజేశ్‌ యాదవ్, అమిత్, కవీందర్‌ సింగ్, ఆశిష్‌ కుమార్‌) రెండో రౌండ్‌కు చేరగా తాజా విజయంతో దుర్యోధన్‌ వారి సరసన చేరాడు. రెండో రౌండ్‌లో ఆరో సీడ్‌ జైద్‌ ఎశాశ్‌ (జోర్డాన్‌)తో దుర్యోధన్‌ తలపడతాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top