ఫైనల్ కు చేరిన ఆండీ ముర్రే | andy murray enters into final of australia open | Sakshi
Sakshi News home page

ఫైనల్ కు చేరిన ఆండీ ముర్రే

Jan 29 2015 6:08 PM | Updated on Sep 2 2017 8:29 PM

ఫైనల్ కు చేరిన ఆండీ ముర్రే

ఫైనల్ కు చేరిన ఆండీ ముర్రే

ఆస్ట్రేలియా ఓపెన్ లో బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఫైనల్ కు చేరాడు.

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఫైనల్ కు చేరాడు. గురువారం జరిగిన తొలి సెమీ ఫైనల్ లో ముర్రే  6-7(6-8), 6-0, 6-3, 7-5 తేడాతో బెర్డిచ్ ను బోల్తా కొట్టించాడు. క్వార్టర్ ఫైనల్ లో రఫెల్ నాదల్ ను కంగుతినిపించిన బెర్డిచ్ ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను గెలుచుకని ముర్రేకు సవాల్ విసిరాడు.  అయితే హోరా హోరీగా జరిగిన ఆ సెట్ ట్రై బ్రేక్ దారి తీసింది.

 

చివరకు ఆ గేమ్ ను బెర్డిచ్ కైవశం చేసుకోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.  అనంతరం ముర్రే విజృంభణ కొనసాగింది. ఇక బెర్డిచ్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వని ముర్రే తన ఏస్ లతో బెంబేలెత్తించాడు. వరుస సెట్లను దక్కించుకున్న ముర్రే  తుదిపోరుకు సిద్ధమయ్యాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement