మళ్లీ ఓడిన ఆంధ్ర | Andhra team lost the game in T20 tournment | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన ఆంధ్ర

Apr 4 2014 12:58 AM | Updated on Jun 2 2018 5:38 PM

మళ్లీ ఓడిన ఆంధ్ర - Sakshi

మళ్లీ ఓడిన ఆంధ్ర

సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ (సౌత్‌జోన్)లో ఆంధ్ర జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గురువారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లోనూ గోవా చేతిలో 77 పరుగుల తేడాతో ఆంధ్ర చిత్తుగా ఓడింది.

సాక్షి, విజయనగరం: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ (సౌత్‌జోన్)లో ఆంధ్ర జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గురువారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లోనూ గోవా చేతిలో 77 పరుగుల తేడాతో ఆంధ్ర చిత్తుగా ఓడింది. టాస్ నెగ్గిన గోవా తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది.
 
  కీనన్ వాజ్ (27 బంతుల్లో 53, 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా, ఆంధ్ర బౌలర్లలో శివకుమార్, హరీశ్, స్వరూప్, ప్రవీణ్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆంధ్ర 14.5 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌటైంది. హరీశ్ (17), శివకుమార్ (12) మినహా అందరూ ఒక్క అంకెకే పరిమితమయ్యారు. గోవా బౌలర్లలో హర్షద్, అమిత్ యాదవ్ చెరో 4 వికెట్లు తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement