బ్యాట్స్‌మెన్ వైఫల్యంలో హైదరాబాద్, ఆంధ్ర జట్లు సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఓటమిని చవిచూశాయి. గ్రూప్-బి మ్యాచ్‌లో రాజస్తాన్ 86 పరుగులతో హైదరాబాద్‌ను ఓడించిం ది.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ
కటక్ / భువనేశ్వర్: బ్యాట్స్‌మెన్ వైఫల్యంలో హైదరాబాద్, ఆంధ్ర జట్లు సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఓటమిని చవిచూశాయి. గ్రూప్-బి మ్యాచ్‌లో రాజస్తాన్ 86 పరుగులతో హైదరాబాద్‌ను ఓడించిం ది. తొలుత రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేయగా... హైదరాబాద్ 18.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్‌లో మధ్య ప్రదేశ్ 9 వికెట్లతో ఆంధ్రను ఓడించింది. తొలుత ఆంధ్ర16.4 ఓవర్లలో 58 పరుగులకు ఆలౌట్ కాగా... మధ్య ప్రదేశ్ 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 59 పరుగులు చేసి నెగ్గింది.