ఆసీస్‌కు భారత్ షాక్ | An all-Oceania show in Sultan Azlan Shah Cup final | Sakshi
Sakshi News home page

ఆసీస్‌కు భారత్ షాక్

Apr 12 2015 1:30 AM | Updated on Sep 3 2017 12:10 AM

ఆసీస్‌కు భారత్ షాక్

ఆసీస్‌కు భారత్ షాక్

యువ స్ట్రయికర్ నికిన్ తిమ్మయ్య హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో... అజ్లాన్ షా హాకీ కప్‌లో ప్రపంచ

తిమ్మయ్య హ్యాట్రిక్   అజ్లాన్ షా హాకీ కప్
ఇపో (మలేసియా): యువ స్ట్రయికర్ నికిన్ తిమ్మయ్య హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో... అజ్లాన్ షా హాకీ కప్‌లో ప్రపంచ చాంపియన్స్ ఆస్ట్రేలియాకు భారత్ షాకిచ్చింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 4-2తో ఆసీస్‌పై నెగ్గింది. దీంతో మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్‌కు అర్హత సాధించింది. ఇప్పటికే ఫైనల్ అవకాశాలను చేజార్చుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడింది. రఘునాథ్ (1వ ని.), నికిన్ తిమ్మయ్య (23, 32, 60వ ని.)లు భారత్‌కు గోల్స్ అందించారు. ఆసీస్ తరఫున బీలే (14వ ని.), గోడెస్ (53వ ని.)లు గోల్స్ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement