తొలి డే నైట్‌ టెస్టు మ్యాచ్‌కు అమిత్‌ షా | Amit Shah Will Attend To First Day And Night Match In Eden Garden | Sakshi
Sakshi News home page

తొలి డే నైట్‌ టెస్టు మ్యాచ్‌కు అమిత్‌ షా

Nov 14 2019 5:13 PM | Updated on Nov 14 2019 5:19 PM

Amit Shah Will Attend To First Day And Night Match In Eden Garden - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య కోల్‌కతాలో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరుకానున్నారు. చారిత్రాత్మక ఈడెన్‌ గార్డెన్‌లో నవంబర్‌ 22 నుంచి 26 వరకు ఈ మ్యాచ్‌ జరుగనుంది. తొలి డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌కు రావాల్సిందిగా.. బెంగాల్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ (క్యాబ్‌) ప్రధాని మోదీని, అమిత్‌ షాను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనికి షా సానుకూలంగా స్పందించారని.. తొలి డే అండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌కు హాజరవుతారని క్యాబ్‌ కార్యదర్శి అవిషేక్‌ దాల్మియా తెలిపారు. కాగా ఈడెన్‌ మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హాసీనాతో పాటు, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌తో పాటు టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని కూడా హాజరుకానున్నారు. కాగా కోల్‌కతా టెస్టు సందర్భంగా షూటర్‌ అభినవ్‌ బింద్రా, బాక్సర్‌ మేరీకోమ్, షట్లర్‌ పీవీ సింధు తదితర ఒలింపియన్లను ఘనంగా సన్మానించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఇదివరకే వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement