
ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత రుత్విక శివాని
పుణే వేదికగా జరిగిన ఆలిండియా ర్యాంకింగ్ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
పుణే వేదికగా జరిగిన ఆలిండియా ర్యాంకింగ్ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడా కారిణి గద్దె రుత్విక శివాని చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఖమ్మం జిల్లాకు చెందిన రుత్విక శివాని 21–10, 21–13తో ఐదో సీడ్ అనురా ప్రభుదేశాయ్ (గోవా)పై విజయం సాధించింది.
విజేతగా నిలిచే క్రమంలో ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గిన రుత్విక శివాని తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోలేదు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన రుత్విక నలుగురు సీడెడ్ క్రీడాకారిణులను ఓడించింది.