మేం మునిగాం.. బంగ్లానూ ముంచుతాం | Afghanistan captain Gulbadin Naib jokes ahead of Bangladesh clash | Sakshi
Sakshi News home page

మేం మునిగాం.. బంగ్లానూ ముంచుతాం

Jun 24 2019 2:06 PM | Updated on Jun 24 2019 7:13 PM

Afghanistan captain Gulbadin Naib jokes ahead of Bangladesh clash - Sakshi

సౌతాంప్టన్‌: బంగ్లాదేశ్‌తో నేడు జరుగనున్న మ్యాచ్‌ గురించి అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ గుల్బదీన్‌ నైబ్‌ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ప్రపంచ కప్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లూ ఓడిన అఫ్గాన్‌ సెమీఫైనల్‌ రేసు నుంచి ఔటయింది. బంగ్లా మాత్రం ఐదు పాయింట్లతో నాకౌట్‌ బెర్తుకు పోరాడుతోంది. ఈ నేపథ్యంలో నైబ్‌ మాట్లాడుతూ... తామిప్పటికే మునిగిపోయామని, సోమవారం బంగ్లాను ఓడించి వారినీ ముంచేస్తామని నవ్వుతూ అన్నాడు. భారత్‌తో మ్యాచ్‌లోలాగే పిచ్‌ స్పిన్‌కు సహకరిస్తే బంగ్లాదేశ్‌ను ఓడించడం తమకు కష్టమేం కాదని నైబ్‌ పేర్కొన్నాడు.  ఇప్పటివరకూ అఫ్గానిస్తాన్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి అన్నింటా ఓటమి చూసింది. దాంతో వరల్డ్‌కప్‌ సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement