అదితి డబుల్‌ ధమాకా

Aditi Double Dhamaka in AITA Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటా చాంపియన్‌షిప్‌ సిరీస్‌లో తెలంగాణ అమ్మాయి అదితి ఆరే రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. కొంపల్లిలో జరిగిన ఈ టోర్నీలో ఆమె అండర్‌–16, 18 బాలికల సింగిల్స్‌ విభాగాల్లో విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన అండర్‌–18 బాలికల సింగిల్స్‌ ఫైనల్లో అదితి 6–4, 6–2తో ఆర్ని రెడ్డి (తెలంగాణ)పై గెలుపొందింది. బాలుర విభాగంలో ఇక్బాల్‌ ఖాన్‌ (తెలంగాణ) 7–5, 6–4తో సుహిత్‌ రెడ్డి (తెలంగాణ)ను ఓడించాడు.

అండర్‌–16 ఫైనల్లో అదితి 6–3, 6–4తో అభయ వేమూరి (తెలంగాణ)పై గెలుపొందింది. బాలుర డబుల్స్‌లో మోహిత్‌ జోడీ విజేతగా నిలిచింది. అండర్‌–18 బాలికల డబుల్స్‌ ఫైనల్లో అభయ– అపూర్వ (తెలంగాణ) ద్వయం 6–3, 6–0తో వేద వశిష్ట– వేదరాజు ప్రపూర్ణ (తెలంగాణ) జోడీపై నెగ్గగా... బాలుర విభాగంలో సుహిత్‌ రెడ్డి (తెలంగాణ)–అద్వైత్‌ అగర్వాల్‌ (మహారాష్ట్ర) జంట 7–5, 6–3తో రిషికేశ్‌ సుంకర–కార్తీక్‌ నీల్‌ వడ్డేపల్లి (తెలంగాణ) జోడీని ఓడించి విజేతలుగా నిలిచాయి.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top