న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఎదురీదుతోంది. రెండో రోజు శనివారం తమ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ఆడమ్...
లీడ్స్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఎదురీదుతోంది. రెండో రోజు శనివారం తమ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ఆడమ్ లిత్ (107; 15 ఫోర్లు) సెంచరీతో కెప్టెన్ కుక్ (75; 12 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టుకు శుభారంభం అందించినా... చివర్లో కివీస్ బౌలర్లు రెచ్చిపోయారు. దీంతో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 88 ఓవర్లలో ఐదు వికెట్లకు 253 పరుగులు చేసింది. 70 పరుగుల వ్యవధిలోనే ఈ ఐదు వికెట్లు నేలకూలాయి. తొలి వికెట్‌కు ఓపెనర్లు 177 పరుగులు జత చేశారు.
క్రీజులో బట్లర్ (6 బ్యాటింగ్) బెల్ (12 బ్యాటింగ్) ఉన్నారు. ఇంకా 97 పరుగులు వెనుకబడి ఉంది. మరోవైపు 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గూచ్ (8,900) రికార్డును కుక్ అధిగమించాడు. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 72.1 ఓవర్లలో 350 పరుగులకు ఆలౌటైంది.