ఏపీ పోలీస్ జట్టుకు హాకీ టైటిల్ | A.p police team won hockey title | Sakshi
Sakshi News home page

ఏపీ పోలీస్ జట్టుకు హాకీ టైటిల్

Nov 27 2013 12:06 AM | Updated on Sep 2 2017 1:00 AM

రాష్ట్ర సీనియర్ హాకీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీస్ (ఏపీపీ) జట్టు దక్కించుకుంది.

ఎల్బీ స్టేడియం,న్యూస్‌లైన్: రాష్ట్ర సీనియర్ హాకీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీస్ (ఏపీపీ) జట్టు దక్కించుకుంది. హాకీ హైదరాబాద్ (హెచ్‌హెచ్) ఆధ్వర్యంలో జింఖానా హాకీ మైదానంలో మంగళవారం జరిగిన ఫైనల్లో ఏపీ పోలీస్ జట్టు 2-0 స్కోరుతో రసూల్‌పురా క్లబ్‌పై విజయం సాధించింది. తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి ఇరు జట్ల ఆటగాళ్ల స్కోరును సాధించడంలో విఫలమయ్యారు. ఏపీ పోలీస్ జట్టుకు 47వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సురేష్ గోల్‌గా మలిచాడు.
 
 దీంతో ఏపీ పోలీస్ జట్టు 1-0తో ఆధిక్యాన్ని సాధించింది. ఏపీపీ జట్టు ఆటగాడు రామ్‌కిరణ్ 52 వ నిమిషంలో ప్రత్యర్థి జట్టు డిఫెండర్లను చేధించి అద్బుతంగా చేసిన గోల్‌తో 2-0తో విజయం సాధించింది.  ఈ మ్యాచ్‌లో రసూల్‌పురా క్లబ్ జట్టుకు 10 పెనాల్టీ కార్నర్లు లభించనప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. విజేతగా నిలిచిన ఏపీ పోలీస్ జట్టుకు రూ.20 వేల నగదు బహుమతి లభించగా రూ.15 వేలు రన్నరప్ జట్టుకు లభించాయి. విజేతలకు సుచిత్ర ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ వై.కిరణ్ ట్రోఫీలను అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement