కనిష్టం రూ.300... గరిష్టం రూ.7 వేలు | ... A minimum of Rs 300 and a maximum of Rs 7 finger | Sakshi
Sakshi News home page

కనిష్టం రూ.300... గరిష్టం రూ.7 వేలు

Nov 5 2014 12:50 AM | Updated on Sep 2 2017 3:51 PM

కనిష్టం రూ.300... గరిష్టం రూ.7 వేలు

కనిష్టం రూ.300... గరిష్టం రూ.7 వేలు

ఉప్పల్: భారత్, శ్రీలంకల మధ్య 9న రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం...

ఉప్పల్: భారత్, శ్రీలంకల మధ్య 9న రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్షద్ అయూబ్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మ్యాచ్ సందర్భంగా అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ప్రేక్షకుల కోసం నేటి నుంచి (బుధవారం) టికెట్ల విక్రయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ధర కనిష్టంగా రూ.300...గరిష్టంగా రూ. 7 వేలుగా ఉండనుంది.

జింఖానా గ్రౌండ్స్, ఉప్పల్ స్టేడియంలో విక్రయ కౌంటర్లను ఏర్పాటు చేశారు. టికెట్లను అన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బుక్‌మైషో.కామ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ టిక్కెట్లు కొనుక్కోవచ్చు. హైదరాబాద్ రంజీ క్రికెటర్లకు, హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లకు 240 సీట్లతో ప్రత్యేక బ్లాక్‌ను ఈ సారి అందుబాటులోకి తెచ్చారు. అలాగే హైదరాబాద్ తరఫున వివిధ వయో విభాగాల్లో ఆడిన ఆటగాళ్లకు కూడా మరో బ్లాక్‌ను కేటాయించారు. ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆహ్వానితుడిగా సీఎం కేసీఆర్ రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 అందుబాటులో 34 వేల సీట్లు
 స్టేడియం మొత్తం సీట్ల సామర్థ్యం 34,185. ఇందులో 9 వేల టికెట్లను కాంప్లిమెంటరీగా ఇస్తారు. 54 కార్పొరేట్ బాక్సుల్లో 1080 సీట్లున్నాయి. స్పెషల్ ఎన్‌క్లోజర్ టికెట్ల ధర రూ.7వేలు. ఇవి ఇరు జట్ల డ్రెస్సింగ్ రూమ్‌లకు దగ్గరగా... పెవిలియన్‌కు అటు, ఇటు 80 చొప్పున 160 సీట్లుంటాయి. మిగతా టికెట్ల విషయానికొస్తే... సౌత్ ఈస్ట్ గ్రౌండ్‌ఫ్లోర్ రూ.3వేలు, సౌత్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్, నార్త్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్ రూ.2 వేలు, నార్త్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ రూ.1500, సౌత్ టై రూ.750, నార్త్ టై, వెస్టర్న్ చైర్స్ గ్రౌండ్ ఫ్లోర్ రూ.500, వెస్టర్న్ చైర్స్ ఫస్ట్ ఫ్లోర్, ఈస్టర్న్ చైర్స్ గ్రౌండ్ ఫ్లోర్, ఈస్టర్న్ చైర్స్ ఫస్ట్ ఫ్లోర్ టికెట్లకు రూ.300 ధరగా నిర్ణయించారు.

 భారీ బందోబస్తు
 ఈ మ్యాచ్‌కు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అభిమానులెవరూ తమవెంట తినుబండారాలు, వాటర్ బాటిల్స్, సెల్‌ఫోన్లు, బ్యాగ్‌లు, కెమెరాలను తీసుకురావద్దని అర్షద్ అయూబ్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement