55 కేజీ విజేత రామ్మూర్తి | 55 kg champion Ram murthy | Sakshi
Sakshi News home page

55 కేజీ విజేత రామ్మూర్తి

Mar 31 2014 1:53 AM | Updated on Sep 2 2017 5:22 AM

జాతీయ స్థాయి జూనియర్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో 55 కేజీ విభాగంలో రామ్మూర్తి విజేతగా నిలిచాడు.

 హుడా కాంప్లెక్స్, న్యూస్‌లైన్: జాతీయ స్థాయి జూనియర్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో 55 కేజీ విభాగంలో రామ్మూర్తి విజేతగా నిలిచాడు. జ్యోతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగాయి.  55, 60, 65, 70, 75, 80, 85 కేజీ విభాగాల్లో మిస్టర్ ఇండియా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పాటు తెలంగాణ నుంచి పలువురు బాడీబిల్డర్లు పాల్గొన్నారు. 55 కేజీ విభాగంలో మొదటి స్థానం దక్కించుకున్న రామ్మూర్తి (తమిళనాడు)కి హైదరాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముద్దగౌని రాంమోహన్‌గౌడ్ బహుమతి అందజేశారు.
 
 ఈ కార్యక్రమంలో ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సంజయ్‌మోర్, కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి దేవాలయ చైర్మన్ సుదర్శన్ యాదవ్, తెలంగాణ అమెచ్యూర్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బెన్ని ఫ్రాన్సిస్, నర్సింగంరెడ్డి, పి.మల్లారెడ్డి, సలీం, దయానిధి, శ్రీనివాస్, సంజీవ్, కె.శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement