సూపర్‌స్టార్‌ తరువాత జీవీనే.. | Amyra Dastur to romance GV Prakash | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌ తరువాత జీవీనే..

May 5 2018 8:05 AM | Updated on May 5 2018 8:05 AM

Amyra Dastur to romance GV Prakash - Sakshi

జీవీ.ప్రకాశ్‌ కుమార్‌ ,అమిర దస్తూర్‌

తమిళసినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తరువాత కోలీవుడ్‌లో ఆ స్థాయికి చేరుకున్న నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌నే. ఏమిటీ నమ్మశక్యంగా లేదా? అయితే రండి చూద్దాం. అప్పుడెప్పుడో నటుడు పార్థిబన్‌ ప్రధాన పాత్రలో అంబలి అనే 3డి చిత్రం రూపొందింది. రజనీకాంత్‌ ఈ మధ్య కోచ్చడయాన్‌ అనే 3డీ యానిమేషన్‌ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా తాజాగా ఆయన నటిస్తున్న 2.ఓ చిత్రం 3డీ ఫార్మెట్‌లోనే రూపొందుతోంది. రజనీకాంత్‌ మినహా కోలీవుడ్‌ మరే హీరో 3డీ చిత్రంలో నటించలేదు. అయితే తాజాగా యువ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌ 3డీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.

ఈయన హీరోగా ఇంతకు ముందు త్రిష ఇల్లన్నా నయనతార చిత్రాన్ని తెరకెక్కించిన ఆధిక్‌ రవిచంద్రన్‌ ఆ తరువాత శింబు హీరోగా అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ఫ్లాప్‌ అవడంతో ఆధిక్‌ రవిచంద్రన్‌ తదుపరి చిత్రం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో జీవీ ఆయనకు అవకాశం కల్పించారు. వీరి కాంబినేషన్‌లో 3డీ చిత్రం తెరకెక్కుతోందన్నది తాజా సమాచారం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో కథానాయకిగా నటి అమిరదస్తూర్‌ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో నటి సంజితాశెట్టి, సోనియా అగర్వాల్‌ వచ్చి చేరారు. 2.ఓ చిత్రానికి పనిచేసిన కొందరు సాంకేతిక నిపుణులు జీవీ చిత్రానికి పనిచేస్తున్నారట. తాజా షూటింగ్‌ చెన్నై, కారైక్కుడి ప్రాంతాల్లో నిర్వహించడానికి చిత్ర వర్గాలు రెడీ అవుతున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement