ఏ సెహ్వాగ్‌ ఇది నీ అనుభవమే కదా! | Virender Sehwag Funny Tweet Viral | Sakshi
Sakshi News home page

Jun 1 2018 3:09 PM | Updated on Jun 1 2018 3:14 PM

Virender Sehwag Funny Tweet Viral - Sakshi

వీరేంద్ర సెహ్వాగ్‌ (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. హాస్యం జోడించి వీరు చేసే ట్వీట్‌లు ఆసక్తికరంగా, వ్యంగ్యంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందించే సెహ్వాగ్‌ గత రెండు నెలలుగా ఐపీఎల్‌తో బీజీగా ఉన్నాడు. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ముగియడంతో మళ్లీ తన ట్వీట్‌ల పర్వం మొదలు పెట్టాడు. శుక్రవారం ‘అనుకోకుండా మీ అత్తగారు వస్తే’ అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోని చూసిన అభిమానులు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

ఆ వీడియోలో ఏముందటంటే.. ఇంట్లో తన తల్లిలేదని భావించిన ఓ వ్యక్తి చిన్న ప్లాస్టిక్‌ టబ్‌లో నీటిని తీసుకుని తన భార్య కాళ్లు కడుగుతూ ఉంటాడు. తన భర్త చూపుతున్న ప్రేమ పట్ల ఆ మహిళ ఎంతో పొంగిపోతూ ఉంటుంది. ఇంతలో బయటకు వెళ్లిన ఆయన తల్లి ఆకస్మాత్తుగా వచ్చేస్తుంది. అంతే వెంటనే ఆ భార్యభర్తలు తమ పొజిషన్‌లను మార్చేసుకుంటారు. అప్పటి వరకు తన భార్య కాళ్లు కడిగిన ఆ వ్యక్తి ఆ నీటిని తన నెత్తిపై పోసుకుంటాడు. కాళ్లు కడిగించుకున్న ఆ మహిళా తన భర్త తలపై నీళ్లు పోస్తుంటుంది. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు సైతం వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ‘ఏ సెహ్వాగ్‌ ఇలా నీకు అనుభవమైంది కదా!’ చెప్పూ అంటూ సెటైర్‌ వేస్తున్నారు.

ఉక్కు మహిళకు విషెస్‌
ఒలింపిక్స్‌లో మహిళగా తొలి పతకం సాధించిన తెలుగు బిడ్డ కరణం మల్లీశ్వరీకి సెహ్వాగ్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘కరణం మల్లీశ్వరీ జీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఒలింపిక్స్‌లో మహిళగా తొలి పతకం సాధించి ఎంతో మందికి స్తూర్తిని కలిగించారు.’ అని ట్వీట్‌ చేశాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో మల్లీశ్వరీ కాంస్య పతకం గెలుచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement