‘బుద్ధుందా.. లాక్‌డౌన్‌లో ఇలాంటి పిచ్చి వేషాలా?’ | TikTok User Slammed For Despicable Prank On Subway | Sakshi
Sakshi News home page

ప్రాంక్‌స్టార్‌పై మండిపడుతున్న జనాలు

May 15 2020 5:42 PM | Updated on May 15 2020 6:04 PM

TikTok User Slammed For Despicable Prank On Subway - Sakshi

ప్రాంక్‌లు చేయడం.. వాటిని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పెట్టి వ్యూస్‌ పొందడం చాలా మందికి అలవాటు. సాధారణ రోజుల్లో వేరు.. కానీ లాక్‌డౌన్‌ కాలంలో ప్రాంక్‌లు చేస్తే జనాల స్పందన ఎంత సీరియస్‌గా ఉంటుందో ఇది చదివితే అర్థం అవుతుంది. వివరాలు.. అమెరికాకు చెందిన జోష్‌ పాప్కిన్‌(23) అనే వ్యక్తికి ప్రాంక్‌స్టార్‌గా ఎంతో పేరు. రకరకాల ప్రాంక్‌ వీడియోలు చేస్తూ బాగా ఫేమస్‌ అయ్యాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల కిత్రం అతడు రెండు ప్రాంక్‌ వీడియోలు విడుదల చేశాడు. వీటిలో ఒక వీడియో పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(లాక్‌డౌన్‌లో సాహసాలు చేస్తున్న చై-సామ్‌)

ఈ వీడియోలో పాప్కిన్‌ ఓ మెట్రో రైలులో ప్రయాణిస్తుంటాడు. ఇంతలో ఉన్నట్టుండి తన చేతిలోని పాల డబ్బాను జార విడుస్తాడు. అక్కడంతా గందరగోళంగా తయారవ్వడంతో ఆ బోగిలో ఉన్న ప్రయాణికులంతా అక్కడ నుంచి లేచి వెళ్లిపోతారు. ఆ తర్వాత పాప్కిన్‌ బోగిని శుభ్రం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియోను చూసిన జనాలు ‘నీకు బుద్ధుందా.. లాక్‌డౌన్‌ వేళ ఇలాంటి పిచ్చి వేషాలు అవసరమా.. ప్రచారం కోసం మరి ఇంతలా దిగజారాలా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement