ఆ బాలుడి సంకల్పానికి ఫిదా అవ్వాల్సిందే!

Specially Abled Boy To Play Cricket Runs On Knees And Hands - Sakshi

న్యూఢిల్లీ: మనో నిబ్బరం ఉండాలేగానీ సాధించలేనిది ఏదీ ఉండదు. ఇందుకు ఈ దివ్యాంగ బాలుడి ఆటే నిదర్శనం. అతని ధైర్యం ముందు వైకల్యం ఓటమితో తల వంచింది. సంకల్ప బలంతో.. మనో నిబ్బరంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నాడు. తన మిత్రులతో కలసి వారితో సమానంగా క్రికెట్‌ ఆడుతూ.. కళ్లు చెదిరే షాట్స్ కొట్టడమే కాకుండా వికెట్ల మధ్య అతను చేతులతో చేసే రన్నింగ్‌ను చూసి అతని సంకల్పానికి కళ్లు ఆర్పకుండా చూస్తూ ఉండిపోతున్నారు. ఐఎఫ్ఎస్ అధికారిని సుధా రమెన్ ట్వీట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

చదవండి: స్ర్కీన్‌ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..!

‘అతడి ఆట చూసి నాకు మాటలు రావడం లేదు. క్రికెట్‌ను ఇష్టపడేవారు.. ఇష్టం లేనివారు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది’ అంటూ ఆమె ఈ వీడియోను పోస్టు చేశారు. వీడియోని చూసిన నెటిజన్లు అతడి ఆటకు హాట్సాఫ్ చెప్తున్నారు. కాళ్లను నేలపై ఈడ్చుకుంటూ మరో చేతితో బ్యాట్ పట్టుకొని పరిగెత్తడం చూస్తే నిరాశలో ఉన్నవారికి, వైకల్యంతో బాధపడతున్న ఎంతో మందికి అతడు స్ఫూర్తిగా నిలుస్తాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top