‘నువ్వు అదృష్టవంతురాలివి అమ్మా’ | Smriti Irani Shares Adorable Pic of Her Son | Sakshi
Sakshi News home page

ఇంటికి రా చెప్తా : స్మృతి ఇరానీ

Jun 29 2019 2:40 PM | Updated on Jun 29 2019 2:42 PM

Smriti Irani Shares Adorable Pic of Her Son - Sakshi

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని, భావోద్వేగాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటారు. పార్లమెంట్‌ సమావేశాల నిమిత్తం ఢిల్లీలో ఉన్న ఆమె కుటుంబాన్ని మిస్సవుతున్నానంటూ ఇటీవల ఉద్వేగానికి లోనయ్యారు. ఇక శనివారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన కుమారుడు జోహర్‌ ఇరానీ ఫొటో పోస్ట్‌ చేసిన స్మృతి హర్ట్‌ ఎమోజీని జత చేశారు.

ఇందుకు స్పందనగా...‘ ఆ చిన్నారి ఎంత క్యూట్‌గా ఉన్నాడో కదా!!! నువ్వు ఎంతో అదృష్టవంతురాలివైన తల్లివి’  అంటూ జోహర్‌ కామెంట్‌ చేశాడు. ‘ అవునా ఇంటికి రా.. ఎవరు ఎంత క్యూట్‌గా ఉంటారో చెప్తా’ అంటూ స్మృతి బదులిచ్చారు. తల్లీకొడుకులకు సంబంధించిన ఈ సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘మీరిద్దరు అదృష్టవంతులే’ అని కొంతమంది అంటుంటే... ‘తను క్యూట్‌గానే ఉన్నాడు. అదే విధంగా మీలా ఇన్‌స్పైరింగ్‌గా కూడా ఉండాలి’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రధాన నరేంద్ర మోదీ కేబినెట్‌లో రెండుసార్లు చోటు దక్కించుకున్న స్మృతి...ప్రస్తుతం స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని మట్టికరిపించిన ఆమె.. మోదీ 2.0 కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు.

@zohrirani_21 ❤️🥰

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement