పబ్లిసిటీ కోసం ఇంతకు దిగజారుతారా?!

Prateik Babbar Brutally Trolled For His Valentine Day Post - Sakshi

బాలీవుడ్‌ నటుడు ప్రతీక్‌ బబ్బర్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఇంతటి నీచానికి దిగజారుతావా అంటూ మండిపడుతున్నారు. భార్యతో కలిసి ఉన్న అభ్యంతరకర ఫొటోను ప్రతీక్‌  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడమే ఇందుకు కారణం.

ఇంతకీ విషయమేమిటంటే... వాలైంటెన్స్‌ డే సందర్భంగా విషెస్‌ చెబుతూ ప్రతీక్‌, తన భార్య సన్యా సాగర్‌తో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశాడు. అయితే ఈ ఫొటోలో వారిద్దరు టాప్‌లెస్‌గా ఉండటాన్ని నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. ‘ఛీ.. పబ్లిసిటీ కోసం ఇంతకు దిగజారుతావా.. ఇలాంటి అభ్యంతరకర ఫొటో ఎందుకు పెట్టావు.. వెంటనే దానిని తొలగించు’ అంటూ ట్రోల్‌ చేశారు. దీంతో ప్రతీక్‌ ఈ ఫొటోను డెలీట్‌ చేశాడు. కాగా ప్రతీక్‌- సన్యా సాగర్‌ గత నెలలో పెళ్లి చేసుకున్నారు. లక్నోలో మరాఠీ- హిందూ సంప్రదాయ పద్ధతుల్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top