కండల వీరుడు.. స్నానం చేస్తుంటే.. | Bodybuilder Kangaroo is breaking the Australian Internet | Sakshi
Sakshi News home page

కండల వీరుడు.. స్నానం చేస్తుంటే..

Oct 12 2017 10:04 AM | Updated on Oct 12 2017 10:05 AM

Bodybuilder Kangaroo is breaking the Australian Internet

పెర్త్‌ : మెలితిరిగిన శరీరం అచ్చూ బాడీ బిల్డర్‌ను పోలిన కంగారూ ఇప్పుడు ఆస్ట్రేలియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. వెస్టర్న్‌ ఆస్ట్రేలియాలో గల మార్గరెట్‌ నదిలో బాడీ బిల్డర్‌ కంగరూ స్నానం చేస్తూ ఓ వ్యక్తి కంటపడింది. కంగారూ దేహధారుడ్యాన్ని చూసి మతి పోయిన అతను తన కెమెరాకు పని చెప్పాడు.

6.5 అడుగుల ఎత్తున్న కంగరూను పలు చిత్రాల్లో బంధించాడు. ప్రస్తుతం ఈ చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కంగారూ తన వైపు రావడంతో అక్కడి నుంచి తప్పించుకుని వచ్చినట్లు చెప్పాడు. కండలు తిరిగిన కంగారూ దాదాపు 100 కిలోల బరువు ఉంటుందని వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement