సెల్ఫీ కోసం సీఎం భార్య రూల్స్‌ బ్రేక్‌ | Amruta Fadnavis Takes Risky Selfie On Board India First luxury Cruise | Sakshi
Sakshi News home page

Oct 21 2018 4:09 PM | Updated on Oct 21 2018 4:27 PM

Amruta Fadnavis Takes Risky Selfie On Board India First luxury Cruise - Sakshi

స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంటే చాలు.. ఒక్క క్లిక్కుమనిపించి వెంటనే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం అందరికి

ముంబై : సెల్ఫీ.. ప్రస్తుతం అందరికి ఓ ఫ్యాషన్‌గా మారింది. స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంటే చాలు.. ఒక్క క్లిక్కుమనిపించి వెంటనే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం అందరికి ఓ అలవాటైంది. మితిమీరిన ఈ ఫ్యాషన్‌తో కొంతమంది ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. ఈ ట్రెండ్‌ సెలబ్రిటీలకు మినహాయింపు కాదు. ఇలానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్‌ సతీమణి అమృత సైతం సెల్ఫీ కోసం రూల్స్‌ బ్రేక్‌ చేశారు. భారత్‌ తొలి దేశియ ప్రయాణీకుల నౌక ఆంగ్రియాలో ప్రయాణించిన ఆమె పర్‌ఫెక్ట్‌ సెల్ఫీ కోసం రక్షణ గోడ దాటారు. భద్రతా సిబ్బంది ఎంత వారించిన ఆమె పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సరదాగా కామెంట్‌ చేస్తుంటే మరికొందరు ఆమె చర్యను తప్పుబడుతున్నారు. క్రూయిజ్ టూరిజాన్ని వృద్ధి చేయడంలో భాగంగా శనివారం ఈ షిప్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement