
సాక్షి, చిత్తూరు : వైఎస్‌ఆర్‌సీపీ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తోందని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకహోదా కోసం పోరాడుతామని, కేంద్రం నుంచి ప్రకటన రాకుంటే ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రయోజనాలపై తెలుగుదేశానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే తమతోపాటు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశం ఎంపీలు ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఊసరవెల్లిలా రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, ప్రస్తుతం బాబు మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని వరప్రసాద్ పేర్కొన్నారు.