
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, నాలుగేళ్లుగా ఆయన ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలపై టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని తెలిపారు. విభజన హామీలపై మొదటినుంచీ వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తోందని, ప్రత్యేక హోదా సాధనం కోసం వైఎస్ జగన్ ధర్నాలు, దీక్షలు చేశారని గుర్తుచేశారు. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలుచేసేవరకు అలుపెరగని పోరాటం కొనసాగిస్తామని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు.