‘నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి’ | YSRCP MLA Thadishetty Raja Fires On TDP Leaders | Sakshi
Sakshi News home page

‘టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి’

Jun 26 2019 4:29 PM | Updated on Jun 26 2019 5:29 PM

YSRCP MLA Thadishetty Raja Fires On TDP Leaders - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్థించిందని వైఎస్సార్‌సీపీ తుని ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా అన్నారు. హైకోర్టు తీర్పును కూడా అగౌరవ పరిచే విధంగా కొందరు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని.. ఇది ఖచ్చితంగా కోర్టు తీర్పు ఉల్లంఘనే అని విమర్శించారు. మాజీ మంత్రి యనమల ఒక రకమైన నిస్పృహలో ఉన్నారని, సీఎం జగన్‌పై  ఆయన చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

టీడీపీ నేతలు తమ నోటిని అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలని రాజా హెచ్చరించారు. చంద్రబాబు నాయుడి తుగ్లక్ పాలన చేయబట్టే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారని ఎద్దేవా చేశారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీకి 23 ఎమ్మెల్యే లు, ముగ్గురు ఎంపీలతో ప్రజలు సరిపెట్టారని.. వైఎస్‌ జగన్ పరిపాలనను రాష్ట్ర ప్రజలంతా కొనియాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేత దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం శుభపరిణామం అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement