‘మనుషులు వేరు కానీ, ఆ ఇద్దరి మనసులు ఒకటే’ | YSRCP MLA Gudivada Amarnath Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

శిఖండిలా బాబు ఉద్యమాలు చేయిస్తున్నారు

Jan 12 2020 7:35 PM | Updated on Jan 12 2020 8:25 PM

YSRCP MLA Gudivada Amarnath Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాజధాని మారితే తన భూముల రేట్లు  తగ్గిపోతాయనే భయంతో చంద్రబాబు నాయుడు ఆందోళనలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని తరలిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడా చెప్పలేదన్నారు. తన భూముల ధరలు పడిపోతాయనే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. మహిళలను ముందు పెట్టుకొని ఒక శిఖండిలా చంద్రబాబు ఉద్యమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లు కాలయాపన చేసి ఇప్పుడు జోలె పట్టుకొని అడుక్కోవడం సిగ్గు చేటన్నారు. ప్రజల్లో సానుభూతి కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని విమర్శించారు. 40 అనుభవం అనుకునే చంద్రబాబు తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ఊసరవెళ్లి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు తీరు ఉందని ఎద్దేవా చేశారు. 13జిల్లాల అభివృద్ధి చంద్రబాబుకు అవసరం లేదా అని ప్రశ్నించారు. తన వర్గం కోసం, తన బినామీల కోసం చంద్రబాబు ఆందోళనలు చేస్తున్నారే తప్ప ప్రజల కోసం కాదన్నారు. 



ఉత్తరాంధ్ర అభివృద్ధి సీపీఐకి  అవసరం లేదా?
సీపీఐ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు ఏరకంగా మద్దతు పలుకుతారని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. కమ్యూనిస్టులు టీడీపీ కార్యకర్తలుగా మారిపోయారని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సీపీఐకి అవసరం లేదా అని ప్రశ్నించారు. చద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు మనుషులు వేరు కానీ, మనసులు మాత్రం ఒకటే అన్నారు. 

సుజనా తీగ లాగితే.. సుజన డొంక కదులుతుంది
రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. దేశ ప్రతిష్టను కించపరిచేలా సుజనా మాట్లాడారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాని తెలిపారు. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలాగా సుజనా కూడా దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుజనా చౌదరి తీగ లాగితే.. చంద్రబాబు డొంక కదులుతుందన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ కూడా అన్ని ప్రాంతాల అభివృద్ధే కావాలన్నదని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. సీఎం జగన్‌ నిర్ణయాలకు ప్రజలంతా మద్దతుగా ఉండాలని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement