
కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ (ఫైల్ ఫొటో)
సాక్షి, కృష్ణా : మచిలీపట్నం పర్యటనకు వచ్చిన కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ను ఆదివారం వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సారి బడ్జేట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొండి చేయి చూపించారని, విభజన చట్టంలోని హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకునే యత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ నేత పేర్ని నానితో పాటు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.