మదనపల్లెలో కొనసాగుతున్న బంద్‌ | YSRCP Leaders Attend To Manadhapally Bandh | Sakshi
Sakshi News home page

మదనపల్లెలో కొనసాగుతున్న బంద్‌

Jul 29 2018 10:42 AM | Updated on Mar 23 2019 9:10 PM

YSRCP Leaders Attend To Manadhapally Bandh - Sakshi

బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

సాక్షి, అమరావతి/చిత్తూరు : ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన చేనేత కార్మికుడి మృతికి సంతాపంగా ఆదివారం మదనపల్లెలో చేపట్టిన బంద్‌ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా మన హక్కు అని శనివారం సుధాకర్‌ అనే చేనేత కార్మికుడు ఆత్మహత్యకు చేసుకున్న విషయం తెలిసిందే. మృతుడికి సంతాపంగా ఆదివారం మదనపల్లె బంద్‌కు ప్రతిపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌లో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి పాల్గొన్నారు. బంద్‌కు మద్దతుగా దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారులు బంద్‌ పాటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మిథున్‌రెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, వామపక్ష నేతలు పాల్గొన్నారు. సుధాకర్‌ కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement