‘టీడీపీ ఎంపీలు దోషులుగా మిగులుతారు’

YSRCP Leader Dharmana Prasada Rao Slams TDP MPs - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను అవహేళన చేసిన టీడీపీ నాయకులు, ఎంపీలు  చరిత్రలో దోషులుగా నిలుస్తారని వైఎస్సార్‌ సీపీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, అంజాద్‌ బాషా అన్నారు. హోదాను నిర్లక్ష్యం చేసి ప్యాకేజీయే మేలని నాడు టీడీపీ నాయకులు డ్రామాలాడారని మండిపడ్డారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఎంపీలు రాజీనామా చేస్తే, టీడీపీ దుష్ప్రచారం చేసిందని ధర్మాన మండిపడ్డారు. హోదా కోసం ఎందాకైనా పోరాడతామని స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు హోదాతోనే సాధ్యమని అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం ఎంపీ పదవులను త్యాగం చేయడం ఆషామాషీ కాదని అంజాద్‌ బాషా అన్నారు. మొదటి నుంచీ ప్రత్యేక హోదా కోసం పోరాడతున్నది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని పేర్కొన్నారు. పదవులకు రాజీనామాలు చేసి ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో తమ ఎంపీలు చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కొనియాడారు. టీడీపీ ఎంపీలు ఇప్పటికైనా రాజీనామాలు చేయాలని బాషా డిమాండ్‌ చేశారు.

ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి :

వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం

మీ త్యాగం వృథా కాదు : వైఎస్‌ జగన్‌

చిత్తశుద్ధి నిరూపించుకున్నాం..

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి..

వైఎస్‌ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా!

ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు!

‘వంచన’పై వైఎస్సార్‌ సీపీ గర్జన!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top